Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeమానవిఈ ఆహారం అవసరం

ఈ ఆహారం అవసరం

- Advertisement -

మహిళలు తమ డైట్‌లో కచ్చి తంగా పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మహిళలు వయస్సు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. రుతుస్రావం నుంచి ప్రెగెన్సీ, డెలివరీ, మెనోపాజ్‌ వరకూ ఇలా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. రక్తహీనత, నీరసం, అలసట, తలనొప్పి, రోగ నిరోధకశక్తి తగ్గటం, ప్రెగెన్సీ సంబం ధిత రుగ్మతలు, వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకంగా కొన్ని విటమిన్లు అధిక మోతాదులో అవసరమవుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్‌-ఎ : మహిళల ఆరోగ్యానికి విటమిన్‌-ఏ కీలకమైంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి ‘ఎ’ విటమిన్‌ తీసుకోవటం అత్యంత అవసరం. దీనికోసం టమోటా, క్యారెట్‌, బొప్పాయి, గుమ్మడికాయ, పాలకూర, చేపలు, పాలు, గుడ్లు, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి.
విటమిన్‌-సి : రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవటానికి తప్పకుండా రోజువారీ డైట్‌లో దీన్ని తీసుకోవాలి. ఇది రొమ్ము క్యాన్సర్‌ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం. ఇది సిట్రస్‌ ఫ్రూట్స్‌, స్ట్రాబెర్రీస్‌, టమాటో, జామ, ఉసిరి వంటి వాటిలో లభిస్తుంది.
విటమిన్‌-బి3 : కణాల పనితీరు, పోషకాలను గ్రహించ టంలో, నాడీ వ్యవస్థ పనితీరులో ‘బి3’ విటమిన్‌ కీలకం. ఇది ట్యూనా చేపలు, పల్లీలు, పుట్టగొడుగులు, గోధుమలు, పాలు, గుడ్లు, బీన్స్‌ వంటి వాటిలో ఉంటుంది.
విటమిన్‌-బి6 : హార్మోన్ల ఉత్పత్తి కి, మెదడు ఆరోగ్యానికి, రక్తహీనత వంటి సమస్యలను నివారించటానికి విటమిన్‌-బి6 అవసరం. దీనికోసం డ్రైఫ్రూట్స్‌, నట్స్‌, ఎగ్స్‌, ముడి ధాన్యాలు, బీన్స్‌, అరటిపండ్లు, మాంసం, ఓట్స్‌ వంటివి తీసుకోవాలి.
విటమిన్‌-బి12 : మహిళల్లో రక్తహీనత తగ్గటానికి విటమిన్‌-బి 12 తీసుకోవడం అవసరం. ఇది రక్త కణాలు ఏర్పడటానికి, మెటబాలిజం రేటును పెంచటానికి ఉపయోగపడు తుంది. ఇది చేపలు, పాలు, గుడ్డు, మాంసం, పెరుగు వంటి పదార్థాల్లో అధికం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad