వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సమిష్టి విజయమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. నవీన్‌కుమార్ విజయం సాధించిన అనంతరం శుక్రవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్‌లోని సుల్తాన్‌నగర్‌లో దామోదర్ రాజనర్సింహ పర్యటించారు. దివంగత నేత పీజేఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వారిని సన్మానించారు. అనంతరం వారితో కలిసి హోటల్‌లో టీ తాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం మరింత కష్టపడతామని హామీనిచ్చారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను, ఆరోపణలు తిప్పికొడుతూ ప్రజల్లోకి కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలని తీసుకెళ్లిన నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటామనీ, అండగా ఉంటామని హామీనిచ్చారు.
ఇది సమిష్టి విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



