రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 27న థియేటర్లలోకి వస్తుంది.
ఈ సందర్భంగా మేకర్స్ కర్నూల్‌లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షలులు, హీరో రామ్ అభిమానులు హాజరయ్యారు. ఈవెంట్‌లో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫైర్ వర్క్స్ ప్రేక్షకులు కట్టిపడేశాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండగలా జరిగింది.
హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ,’ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేశాను. కానీ ఇది నాకు చాలా ఎమోషనల్ ఫిలిం. ఈ సినిమాకి ఫీల్ అయినంత ఎమోషన్ ఇంక ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు. ఇప్పటివరకు నేను మిమ్మల్ని లైవ్‌లో చూడలేదు. నన్ను మీరు చూడలేదు. కానీ ఎప్పుడో కలిసాం అనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఈ సినిమా. ఇది నా కెరీర్‌లోనే మోస్ట్ పర్సనల్ ఫిల్మ్. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతమైన టీంతో కలిసి చేసిన సినిమా ఇది. మైత్రి రవికి థ్యాంక్యూ. ఈ సినిమాలో నేను అభిమాని పాత్ర పోషించాను. సూపర్ స్టార్ పాత్రని ఉపేంద్ర పోషించారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆ కనెక్షన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇది పూర్తిగా అభిమానుల సినిమా. భాగ్యశ్రీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. డైరెక్టర్ మహేష్ థియేటర్‌లో కాదు మనలో సౌండ్ వచ్చే సినిమా చేశాడు. అద్భుతమైన సినిమా తీశాడు’ అని తెలిపారు.
‘రామ్ కెరీర్‌లో ఇది అత్యున్నత స్థాయిలో నిలబడే సినిమా కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశాం. ఆ డిజైన్ వెనుక ఉన్న మా లక్ష్యం కూడా అదే. రామ్ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే సినిమా అందరం కలిసి చేశామని అనుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మనందరినీ ఎంతో ఇన్స్పైర్ చేసిన ఉపేంద్రతో వర్క్ చేయడం కూడా అదృష్టం’ అని డైరెక్టర్ మహేష్ బాబు పి చెప్పారు. ఇదే కర్నూల్ గ్రౌండ్‌లో ‘సర్కార్ వారి పాట’ కోసం మహేష్‌ని తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలని మేము అందరం చాలా వర్క్ చేసి, చాలా నమ్మి ఈ సినిమాని చేసాం. కమర్షియల్‌గా, ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా అన్ని రకాలుగా అలరిస్తుంది. ఈ సినిమాని ఫుల్‌గా ఎంకరేజ్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నాం. డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. చాలా కాలం మాట్లాడుకునే సినిమా ఇది. మా హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఈ సినిమాకి ప్రాణం పోశారు.
నిర్మాత రవిశంకర్
ఇది పూర్తిగా అభిమానుల చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



