దర్శకుడు డా.శైలేష్ కొలను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ కాంబోలో సరికొత్త రొమాంటిక్ కామెడీ సినిమా తెరకెక్కనుంది.
రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే అందమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను మేకర్స్ ఆవిష్కరించారు.
‘ఏమో ఏమో ఇది’ అనే టైటిల్ వినగానే ఉల్లాసమైన ప్రేమ భావనలు మనసులో మెదులుతున్నాయి. చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ తల్లీ కొడుకుల మధ్య సరదా సంభాషణతో ప్రారంభ మవుతుంది. నవతరం ప్రేమ బంధాలు, ఆధునిక వివాహాలు వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించారు. గ్లింప్స్‌లో కథానాయిక తన ప్లేలిస్ట్‌లోని అలనాటి క్లాసిక్ పాటను ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. ఆ సన్నివేశం ద్వారా ఆమె లోతైన భావోద్వేగ అనుబంధాన్ని, ప్రేమను ఎంతో అందంగా ఆవిష్కరించారు.
దర్శకుడు శైలేష్ కొలను హద్యమైన, హాయిగా సాగే, సరదాగా నవ్వించే సరికొత్త ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అభరు పాత్రలో రోషన్ మేకా నేటి జెన్ జీ తరం ప్రేమను ఆవిష్కరించే పక్కింటి అబ్బాయి తరహా ఆకర్షణీయమైన పాత్రలో కనిపించనున్నారు. అపూర్వ పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనున్నారు. గ్లింప్స్‌లోనే ఆమె ఉత్సాహభరితమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2026 ఆరంభంలో ‘అనగనగా ఒక రాజు’తో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.
ఈతరం ప్రేమకథ..
- Advertisement -
- Advertisement -



