‘సినిమా సరిహద్దులు లేని భాష. అది ప్రాంతాలు, భాషలు, జాతులు దాటి మనుషులను ఏకం చేస్తుంది’ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. రెండు రోజులు పాటు హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో జరుగనున్న తెలంగాణ నార్త్- ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చిత్రోత్సవాన్ని ప్రారంభించారు. ఆనంతరం త్రిపుర చిత్రమైన ‘యార్వింగ్’ తొలి ప్రదర్శనను వీక్షించారు. ఈ వేడుకలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజుతోపాటు టీఎఫ్‌డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
సినిమా ప్రదర్శనల సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ,’ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, యువశక్తి, మహిళా సాధికారత, ఐటీ, ఆరోగ్య రంగాల్లో విస్తృత భాగస్వామ్యానికి ఈ వేదిక తోడ్పడుతుంది. డిజిటల్ మీడియా ద్వారా అడవి కొండల్లోని దూర గ్రామాల వరకు కూడా తెలుగు సినిమాలు చేరి, విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఇది సినీ శక్తికి నిదర్శనం. హైదరాబాద్ సృజనాత్మకతకు కేంద్ర బిందువై ఎదుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రోత్సవం రెండు ప్రాంతాల సినీ ప్రపంచాల మధ్య దీర్ఘకాలిక బంధాలకు పునాది వేస్తుంది’ అని అన్నారు.
టీఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక టీజీఎఫ్‌డీసీ లక్ష్యాలు, పరిధిని వివరించారు.
రెండు రోజులు పాటు త్రిపుర, మణిపూర్, అస్సాం, మేఘాలయా, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే 12 చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతీయ అవార్డులు పొందిన చిత్రాలతోపాటు తెలంగాణ గ్రామీణ జీవన విధానం, కళాశైలులు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రముఖ తెలుగు చిత్రాలను కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసి ప్రదర్శిస్తున్నామని ప్రియాంక చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రశంసలు పొందిన ‘నా బంగారు తల్లి’, ‘పొట్టేల్’, ‘మల్లేశం’, ‘బలగం’ వంటి తెలుగు చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శితం కానున్నాయి.
ఇది సినీ శక్తికి నిదర్శనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



