Thursday, January 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇది బోధక ద్రవ్యం

ఇది బోధక ద్రవ్యం

- Advertisement -

పెత్తనం
నెత్తిలో విత్తనమై నాటుకున్నాక
ఆధిపత్యం
అరికాలి నుంచి
పైత్యమై తలకెక్కింతర్వాత
దాహానికి నీళ్లు చాలక
చమురే తాగి నెమరేస్తారు
వాళ్లకు కళ్లు చెమర్చవు సరికదా
నిశ్చయంగా చముర్చుతాయి
వాళ్లు చిన్నదేశాలను
విచ్ఛిన్నం చేసేదాకా చుట్టూ పరిక్రమిస్తారు
అంతర్జాతీయ న్యాయసూత్రాలన్నీ
హాయిగా అతిక్రమిస్తారు
యావత్‌ ప్రపంచం
తమ గుప్పిట ఉండేందుకు ఉపక్రమిస్తారు
అన్నట్టు…అర్థంకాక అడుగుతున్నాను గానీ
ఆధిపత్యాన్ని మించిన
మాదకద్రవ్యం మరొకటుందా
ఈ లోకంలో?
ఇది ఇతరుల బర్రెను
తమ దొడ్లో కట్టేసుకున్న
బరితెగించిన బడితె కదూ!
వెనెజువెలా!వెనెజువెలా!!
పోయేకాలంలో దనుజులిలా
ఏకంగా సార్వభౌమత్వాన్నే ఆక్రమిస్తారు
కానీ… అయ్యేకాలం ఒకటుంటుంది సుమా!
అప్పుడు మనుజులెప్పటిలాగే ఎప్పటిలాగే విక్రమిస్తారు
– నలిమెల భాస్కర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -