అనుష్క శెట్టి నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో యాక్టర్ చైతన్య రావు మీడియాతో మాట్లాడుతూ, ”క్రిష్ కథ చెప్పారు. అద్భుతంగా ఉంది. నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు అసలు ఆ క్యారెక్టర్‌లో నన్ను ఎలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. చాలా సీరియస్ అండ్ వైలెంట్ రోల్. ఫస్ట్ టైం విలన్‌గా చేశాను. అయితే ఇది రెగ్యులర్ విలన్‌లాగా ఉండదు. నా రోల్ చాలా కీలకంగా ఉంటుంది. గుర్తుండిపోయే క్యారెక్టర్.
ఇదొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో నాకు ఒక మ్యానరిజం ఉంటుంది. ఈ రోజుల్లో విలన్, హీరో అన్నీ రోల్స్‌ని ఆడియన్స్ సమానంగా ఆదరిస్తున్నారు. యాక్టర్‌గా అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. సత్యదేవ్, ఫహద్ ఫాజిల్ అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. నేను కూడా ఆ స్పేస్‌లోనే చూస్తున్నాను. అనుష్కకి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ‘మయసభ’కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ఘాటి’ రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ క్రిష్, దేవాకట్ట ఇద్దరూ ఈ రెండు ప్రాజెక్ట్స్ బయటకు వచ్చేంతవరకు కొత్త సినిమాల గురించి ఆలోచించవద్దు అన్నారు. ఈ సినిమాల తర్వాత కచ్చితంగా నా కెరీర్ మరో మలుపు తిరుగుతుందని చెప్పారు. వాళ్లు చెప్పింది నిజమౌతుంది’ అని చెప్పారు.
నా కెరీర్‌లో ఇదొక.. ఐకానిక్ రోల్
- Advertisement -
- Advertisement -