Sunday, April 5, 2026
E-PAPER
Homeసినిమాఇది సాధారణ కథ కాదు..

ఇది సాధారణ కథ కాదు..

- Advertisement -

పార్ధ గోపాల్‌ నిర్మాణంలో దర్శకుడు సూర్య జి.యాదవ్‌ రూపొందిస్తున్న మూవీ ‘డైమండ్‌ డెకాయిట్‌’.
ఈ చిత్ర ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వాకడ అప్పారావు, శివాజీరాజా, పథ్వీరాజ్‌ తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత శిరీష్‌ రెడ్డి మాట్లాడుతూ,’ట్రైలర్‌ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కథలో ఉన్న ఇంటెన్స్‌ చాలా స్ట్రాంగ్‌ ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అని తెలిపారు.
‘ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఎంతో ఆనందంగా ఉంది. ఇది సాధారణ కథ కాదు. సస్పెన్స్‌, ఎమోషన్స్‌, థ్రిల్‌ అన్నీ కలిసిన పూర్తి ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి ఇస్తుంది. ప్రతి ఒక్కరూ మా సినిమాను ఆదరించాలని కోరుతున్నాం’ అని హీరో పార్ధ గోపాల్‌ తెలిపారు.
రచయిత, దర్శకుడు సూర్య జి యాదవ్‌ మాట్లాడుతూ,’రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందించాం. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -