Sunday, May 18, 2025
Homeసమీక్షఅమృతకాలం కాదిది ఆపత్కాలం!

అమృతకాలం కాదిది ఆపత్కాలం!

- Advertisement -


ఈ పుస్తకానికి ముఖచిత్రం అమీబాను వేస్తూ దాని చేతులకు శీర్షికలను ఇలా చెప్పారు- ఆకలి, అవినీతి, అభద్రత, నిరుద్యోగం, అధిక ధరలు, మతోన్మాదం, అరాచకత్వం, ఆదాని అని. విషయసూచికలో ముందు మాట, ఉపోద్ఘాతం, అవినీతికోరలు, ఆదానీ లీలలు, ప్రజాస్వామ్య హననం, ఆర్థిక వైఫల్యాలు, అంతులేని చిట్టా అనే అంశాలపై పుస్తకంలో విస్తతంగా చర్చించారు రచయిత. 2014 – 2023 ఈ మధ్య భాజాపా పాలనలో జరిగిన అంశాలను ప్రస్తావించారు. ”ఈ పదేళ్లలో – మీడియా ప్రచారపు హోరులో పడి వాస్తవాలు ఎరుగకుండానే, దేశం అమతకాలంలో ప్రయాణం చేస్తున్నదని భ్రమపడుతున్నవారి కోసం, కఠోర వాస్తవాలను విప్పి చెప్పడం ద్వారా కొందరికైనా కనువిప్పు కలిగించటానికి!” అని పుట-7లో విస్పష్టంగా ముందుమాటలో దివికుమార్‌ (జనసాహితి) చెప్పారు.
ఈ దశాబ్దంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ, న్యాయవ్యవస్థలపైన జరిగిన విధ్వంసం ఎంతో పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చేయబడింది. మరి అంతకు ముందు కూడా ఇలాంటి విపరీత పరిణామాలు జరుతూనే ఉండేవి కదా! అని కొంతమంది వాదిస్తారు. కరెక్టే. కానీ గిల్లడానికి, కొట్టడానికి, చంపడానికి ఉండే తేడా ఇక్కడ కూడా వర్తిస్తుంది. న్యూ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌, కర్తవ్యకాల్‌, అమతకాల్‌, శ్రేష్ఠ భారత్‌, వికసిత భారత్‌ వంటి రకరకాల, రంగురంగుల పేర్లతో కాలం వెళ్ళదీయడం తప్ప, వాటి స్ఫూర్తిని చిత్తశుద్ధితో అంది పుచ్చుకున్నదీ లేదని పుట – 11 లో అంటారు. అంతేకాదు ”ఈ పుస్తకం పదేళ్ల భాజాపా పాలనకు సినాప్సిస్‌” అని పుట -13లో ఉటంకించారు. రాజకీయ అంశాలపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఒకసారి చూడవచ్చు.

  • టి. రంగస్వామి, 9949857955
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -