బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్-ది తాండవం ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. శుక్రవారం ముంబైలోని జుహూలోని పీవీఆర్ మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో పూర్తి పాటను లాంచ్ చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ,’హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమాన్ని ఈ సినిమాలో చూస్తారు. ధర్మంగా బతకండి, సత్యం మాట్లాడండి, అన్యాయానికి తలవంచకండి..ఇది అఖండ తాండవం. బోయపాటితో మూడు సినిమాలు చేశాం.
‘సింహ, లెజెండ్, అఖండ..’ మూడు హ్యట్రిక్ హిట్స్. ఇది నాలుగో సినిమా. బోయపాటి, నేను ఒకటే వేవ్ లెంత్‌లో వర్క్ చేస్తాం. తమన్, మాది అద్భుతమైన కాంబినేషన్. ప్రతిఒక్కరు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమాని చూపించాలి. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది’ అని తెలిపారు. ‘ఇది కేవలం ఒక సినిమా కాదు. భారతదేశానికి ఆత్మతో సమానం. భారతదేశం యొక్క ధర్మం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్లి ఆనందంగా చూసే సినిమా ఇది’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ‘అఖండ’కు మించి ఉంటుంది. బాలయ్య అంటే హిస్టరీ. చరిత్ర సృష్టిస్తూనే ఉంటారు. ఇంటర్వెల్ సీన్ మీకు పైసా వసూల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుంది’ అని అన్నారు,
ఇది కేవలం సినిమా కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



