Thursday, July 31, 2025
E-PAPER
Homeమానవివీటికి దూరంగా...

వీటికి దూరంగా…

- Advertisement -

భయంకరమైన వ్యాధులలో క్యాన్సర్‌ ఒకటి. మనం రోజూ ఇంట్లో వాడే కొన్ని వస్తువులు క్యాన్సర్‌కు కారణమవుతాయి. అటువంటి ఉత్పత్తులను వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..


ప్లాస్టిక్‌ కట్టింగ్‌ బోర్డులు: అనేక అధ్యయనాల ప్రకారం, ప్లాస్టిక్‌ కట్టింగ్‌ బోర్డులను ఉపయోగించడం వల్ల మైక్రోప్లాస్టిక్‌ శకలాలు ఆహారంతో కలిసిపోతాయి. ఈ ప్లాస్టిక్‌ శకలాలు శరీరంలోకి చేరి క్యాన్సర్‌ , జీర్ణకోశ సమస్యలకు కారణమవుతాయంటున్నారు. కాబట్టి ప్లాస్టిక్‌ కట్టింగ్‌ బోర్డ్‌కు బదులుగా చెక్క కట్టింగ్‌ బోర్డులను ఉపయోగించవచ్చు.
కొవ్వొత్తులు: మనం ఇంట్లో ఉపయోగించే సువాసనగల కొవ్వొత్తులు చాలా ప్రమాదకరమై నవి. ఈ కొవ్వొత్తులలో థాలేట్స్‌ అనే హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతాయి. అనేక అధ్యయనాల ప్రకారం, వీటిని కాల్చినప్పుడు, హానికరమైన వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. ఇవి ఇండోర్‌ గాలిని కలుషితం చేస్తాయి.
నాన్‌-స్టిక్‌ వంటసామాను: గీతలు లేదా చిప్‌ చేయబడిన నాన్‌-స్టిక్‌ వంటసామాను క్యాన్సర్‌ కారక రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. ఈ రసాయనాలు పాడైపోయినప్పుడు ఆహారంలో కలిసిపోతాయి. ఇవి కాలేయ వ్యాధి, కిడ్నీ క్యాన్సర్‌, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -