నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నాలుగో సీజన్‌లో భారత్ తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో తలపడుతోంది. అక్కడే భారత టెస్టు జట్టుసారథి శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమావేశం నిర్వహించారు. అనంతరం టీమ్‌ఇండియా స్క్వాడ్‌ను ప్రకటించారు.
భారత్ జట్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్, జగదీశన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్