Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ పోస్ట్ మాస్టర్ మాకొద్దని పింఛనుదారుల ధర్నా

ఈ పోస్ట్ మాస్టర్ మాకొద్దని పింఛనుదారుల ధర్నా

- Advertisement -

వెంటనే బదిలీ చేయండి 
వృద్ధ, వికలాంగులు, ప్రజలు పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా
నవతెలంగాణ – నెక్కొండ 

ప్రతినెల వృద్ధ, వికలాంగ, వితంతు పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న పోస్టుమాస్టర్ ను వెంటనే బదిలీ చేయాలంటూ గురువారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ఎదుట పింఛన్దారులు, పట్టణ ప్రజలు ధర్నా చేపట్టారు. ప్రతినెల వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అందించే పింఛన్ల పంపిణీలో పోస్ట్మాస్టర్ రత్నమాల సకాలంలో పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉండగా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ జాప్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు పింఛన్దారులు వాపోయారు.

మండలంలోని అన్ని గ్రామాలలో సకాలంలో పింఛన్లు పంపిణీ చేస్తుంటే నెక్కొండ పట్టణంలో మాత్రం పోస్టుమాస్టర్ రత్నమాల పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం చేసి ఆలస్యంగా అందించడంతో ఆర్థికంగా, పోస్టు ఆఫీస్ చుట్టూ పలుమార్లు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నామని పింఛన్దారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పించన్దారులతో కలిసి స్థానికులు దాసరి శ్రీనివాస్, రవిబాబు, వరుణ్, శ్రీకాంత్, వినోద్, చందపాషా, వీరమ్మ, నూరజన్, విజయరాణి, కుమార్, కట్టయ్య తదితరులు పింఛన్దారులతో కలిసి ధర్నాకు దిగారు. తపాల శాఖ ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని వెంటనే పింఛన్లు అందించకుండా ఇబ్బందులు గురి చేస్తున్న పోస్ట్ మాస్టర్ రత్నమాలను బదిలీ చేయాలంటూ పట్టణ ప్రజలు, పింఛన్దారులు పోస్ట్ ఆఫీస్ ఎదుట ధర్నాలో డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -