Tuesday, February 17, 2026
E-PAPER
Homeసినిమాఈతరం 'గీతాంజలి'

ఈతరం ‘గీతాంజలి’

- Advertisement -

సౌమిత్‌ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి.కె.వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవే’. పీఓవి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజ్‌ అల్లాడ, గిరిధర్‌ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు.
ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈనెల 13న విడుదలై, అద్భుతమైన రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో మేకర్స్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. గీత రచయిత చంద్రబోస్‌ వీడియో బైట్‌ ద్వారా స్పందిస్తూ బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిందని, టీమ్‌ను అభినందించారు.

ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ, ”ఈ వాలెంటైన్స్‌ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్‌ టాక్‌ తెచ్చుకుంది. డీసెంట్‌ కలెక్షన్స్‌తో సైలెంట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో, హీరోయిన్‌ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్‌ స్టార్స్‌ అవుతారు’ అని తెలిపారు. ‘చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాననే ఫీలింగ్‌ మనసుకు కలిగింది. బాపు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ కవితలా, నేటి జనరేషన్‌ ‘గీతాంజలి’లా ఈ చిత్రం నిలుస్తుంది’ అని మరో అతిథి జెమిని సురేష్‌ చెప్పారు. హీరో సౌమిత్‌ మాట్లాడుతూ, ‘ఆడియెన్స్‌ నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్‌ హిట్‌గా మా చిత్రం నిలిచింది’ అని తెలిపారు.

‘అతిథి పాత్రలో నన్ను నమ్మిన సాయి వెన్నం, సౌమిత్‌కు థ్యాంక్స్‌. మొదటి చిత్రంతోనే సక్సెస్‌ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు’ అని హీరోయిన్‌ శ్రేయాసి సేన్‌ చెప్పారు. దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ,’మన ఇంటెన్షన్‌ ప్యూర్‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి అనేది ఈ చిత్రంతో తెలుసుకున్నాను. టీమ్‌ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్‌ వచ్చింది’ అని అన్నారు. ‘చక్కటి మ్యూజికల్‌ లవ్‌ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. మా సినిమాకి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది’ అని నిర్మాత రాజ్‌ అల్లాడ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -