Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలు

రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలు

- Advertisement -

తొలగించాలని గ్రామస్తుల వేడుకోలు 
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలోని పెద్దమ్మ గుడి నుండి పెంజరు మీదుగా బిసి కాలనీ వరకు ఉన్న ప్రదాన రహదారి పై ఇరువైపుల తుమ్మలు ఏపుగా పెరిగి రహదారి ముసుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ రహదారి గుండా నిత్యం ఏఎమ్మార్ కంపెనీ లో పని చేసే కార్మికులతో పాటు తోల్లపాయ, కరకల్ల సదరు, కాపురం శివారు రైతులు సైతం తమ పంట పొలాలకు ఈ రహదారి నుండే వెళ్తారు. ఇరువైపులా రోడ్డు కు అడ్డంగా తుమ్మలు పెరిగి వాహనదారులు, రైతుల ఎడ్లబండ్లు వెళ్లక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు రైతులు, గ్రామస్తులు పేర్కొంటున్నారు. రైతులు, ఏఎమ్మార్ కార్మికుల శ్రేయస్సు కోసం రోడ్డుకు ఇరువైపుల ఉన్న తుమ్మ చెట్లు తొలగించేందుకు సంబందిత అధికారులతో పాటు ఏఎమ్మార్, అధికారులు సైతం చొరవ చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -