Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుపత్తిరైతు ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు

పత్తిరైతు ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు

- Advertisement -

నల్లబడుతున్న తెల్ల బంగారం
నవతెలంగాణ – మల్హర్ రావు

నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెల్లబంగారం నల్లబడుతోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పత్తి ఏరలేని దుస్థితి నెలకొంది. దీంతో చేతికందొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బాగా వచ్చిందని, మద్దతు ధర కూడా ఆశించిన మేర ఉందన్న ఆనందం కాస్త ఆవిరైందని వాపోతున్నారు. మండలంలో 3,800 వేల ఎకరాలకు పైగా పత్తిని సాగు చేశారు. అత్య దికంగా తాడిచెర్ల, నాచారం, ఆన్సాన్పల్లి, రుద్రారం, కొండంపేట, మల్లంపల్లి, పెద్దతూండ్ల తదితర గ్రామాల్లో పండించారు. ఒక్కో రైతు 3 నుంచి 5 ఎకరాల్లో రూ. వేలల్లో పెట్టుబడి పెట్టి బంగారం పండించారు.

పంట బాగా పండిందని, మంచి లాభాలు వస్తాయనుకునే సమయంలో అధిక వానలు పడి..వారి పాలిట శాపంగా మారాయి. వందలాది ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఎప్పుడూ లేని విధంగా క్వింటా ధర రూ.8 వేలకు పైగానే డిమాండ్ ఉంది. పంటకు పెద్దగా తెగుళ్లు సోకక పోవడం, పూత, కాత బాగా పండటంతో ఈ ఏడు బాగా కలిసి వచ్చిందని రైతులు మురిసి పోయారు. సిరుల పంట పండినట్లేనని భావించారు. కానీ.. వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. పంట ఇంటికి వచ్చే సమయంలో కుండపోత వర్షాలు నేలపాలు చేశాయి. పత్తి చెట్లపైనే తడిసి, రంగుమారింది. మొలకెత్తడం తదితర కారణాలతో ధరలో భారీగా వ్యత్యాసం నెలకొం దని ఆందోళన చెందుతున్నారు. లాభాలు వస్తాయని ఆశిస్తే.. నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

పరిహారం అందించాలి..
ఎడతెరిపి లేని వానలు తీవ్ర నష్టం కలిగించాయి. పత్తి తడిస్తే బరువు, రంగులో తేడా వస్తుంది. తీసిన పత్తిని అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వస్తే పెట్టుబడి దక్కుతుంది. ప్రస్తుత వానల కారణంగా ఎక రాకు 5 క్వింటాళ్లు వచ్చేలా లేదు. విత్తనం మొదలు.. పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుత వర్షాలతో పత్తి తడిసిపోయింది. పెట్టుబడి వచ్చేలా లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -