Sunday, April 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅవి యుద్ధ నేరాలే

అవి యుద్ధ నేరాలే

- Advertisement -

అమెరికా దాడులపై న్యాయ నిపుణుల హెచ్చరిక
వాషింగ్టన్‌ :
ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులు యుద్ధ నేరాలేనని అగ్రరాజ్యంలోని వంద మందికి పైగా అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. హార్వర్డ్‌, యాలే, స్టాన్‌ఫర్డ్‌ వంటి పాఠశాలలు, కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన న్యాయ నిపుణులు ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అమెరికా దళాల చర్యలు, సీనియర్‌ అధికారుల ప్రకటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వారు ఆ లేఖలో తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, అంతర్జాతీయ మానవతావాద చట్టం ఉల్లంఘనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌పై కేవలం వినోదం కోసమే దాడి చేస్తున్నామంటూ గతంలో ట్రంప్‌ చేసిన ప్రకటనను వారు తమ లేఖలో ప్రస్తావించారు. జస్ట్‌ సెక్యూరిటీ పాలసీ జర్నల్‌ వెబ్‌సైటులో ఈ లేఖను ప్రచురించారు. ఇరాన్‌లోని పాఠశాలలు, వైద్య కేంద్రాలు, జనావాసాలపై జరుగుతున్న దాడులపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ యుద్ధం మొదటి రోజున పాఠశాలపై జరిగిన దాడిని ప్రస్తావించారు.
యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రదర్శిస్తున్న వాక్చాతుర్యంపై అమెరికాకు చెందిన ప్రముఖ ముస్లిం సలహా బృందం మండిపడింది. ట్రంప్‌ వ్యాఖ్యలు రాతి యుగం నాటి కాలానికి తీసుకెళుతున్నాయని, అవి అమానవీయంగా ఉన్నాయని ధ్వజమెత్తింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -