Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయంఆ పిల్లలు భవిష్యత్‌కు ఆశాకిరణం

ఆ పిల్లలు భవిష్యత్‌కు ఆశాకిరణం

- Advertisement -

– మతపరమైన గుర్తింపు లేకుండా పాఠశాలల్లో చేరటం అభినందనీయం : కేరళ హైకోర్టు జడ్జి వి.జి అరుణ్‌
తిరువనంతపురం :
మతపరమైన గుర్తింపు లేకుండా స్కూళ్లలో చేరే చిన్నారులు భవిష్యత్‌కు ఆశాకిరణమని కేరళ హైకోర్టు జడ్జి వి.జి అరుణ్‌ అన్నారు. ఈ విషయంలో ముందుకొచ్చిన చిన్నారుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు. హేతువాద సంస్థ కేరళ యుక్తివాది సంఘం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో రచయిత వైశాఖన్‌ను సత్కరించారు. వైశాఖన్‌తో పాటు హేతువాది, రచయిత పావనన్‌లు దృఢ విశ్వాసం, అభిప్రాయం కలిగిన వ్యక్తులుగా జడ్జి అభినందించారు. ”మతపరమైన గుర్తింపు లేకుండా మీ పిల్లలను చేర్పించకుండా సిద్ధంగా ఉన్న మిమ్మల్ని (తల్లిదండ్రులు) నేను అభినందిస్తున్నాను. ఇలా చేరిన చిన్నారులు భవిష్యత్‌కు ఆశాకిరణంగా ఉంటారు. సమాజంలో ప్రశ్నిస్తుంటారు” అని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా రచయితలపై జరుగుతున్న దాడులను కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు రాబందుల్లా ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా సోషల్‌ మీడియా పోస్టులతో సంబంధం ఉన్న పిటిషన్‌లను తాను హైకోర్టులో చూస్తున్నానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -