Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడ్వకేట్ స్వప్న మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

అడ్వకేట్ స్వప్న మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులుమామిడి వెంకట్ రెడ్డి…
 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
అడ్వకేట్ స్వప్న మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, న్యాయవాద రక్షణ చట్టం లేకపోవడం ద్వారానే  రాష్ట్ర వ్యాప్తంగాదాడులు జరుగుతున్నాయని న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్  రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.చేవెళ్ల కోర్టు  నందు అడ్వకేట్  గా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న  పై వారి సోదరుడు ఆస్తి  వివాదాలు విషయం లో అత్యంత కిరాతంగా దాడి చేసి ఆమే మరణం నకు  కారకులైన వారిని కఠినంగా ,చట్ట పరముగా శిక్ష వేయాలి అని  అల్ ఇండియా లాయర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు. ఐ లు జిల్లా గౌరవ అధ్యక్షులు కుక్కదువు సోమయ్య, జిల్లా అధ్యక్షులు బొల్లేపల్లి  కుమార్, ఉపాధ్యక్షులు తడక మోహన్, పాల్వంచ జగతయ్య,ఎండి నిహాల్, సహాయ కార్యదర్శి సీసా శ్రీనివాస్, సుధ గాని శ్రీహరి,చింతల రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి బొడ్డు కిషన్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -