Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్సు ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

బస్సు ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి కారణమైన వారి కఠినంగా శిక్షించి, బస్సులో సజీవ దహనమైన  కుటుంబాలకు బస్సు యజమాన్యం నుండి కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని మామిడిపల్లి అంబేద్కర్ భవన్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ బస్సు డ్రైవర్ అతివేగం వలన, నాలుగుపెనాల్టీలు పడ్డట్లు రుజువైందని, బస్సు యాజమాని నిర్లక్ష్యం వల్ల,  ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దీనికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని దాసు కోరారు. 

ఎన్నెన్నో ఆశలతో ఉద్యోగాల కోసం బెంగళూరు వెళ్తున్న యువత సజీవంగా మంటల్లో కాలిపోవడం, విషాదకరమని, ఆయన అన్నారు.ముక్కు పచ్చలారనీ పిల్లలు సైతం ప్రాణాలు  కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లాభాలు తప్ప ప్రయాణికుల జాగ్రత్త, భద్రత విస్మరిస్తున్న ప్రైవేటు బస్సు యజమానుల పట్ల ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రవేట్ బస్సు యజమాన్యం నిర్దిష్టంగా నిబంధనలు పాటించేటట్లు షరతులు విధించాలని, లేనిచో వారి బస్సులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ నాయకులు అబ్దుల్, బాలయ్య, ప్రజా సంఘాల నాయకులు వర్ణారెడ్డి, పోశెట్టి, రాజేష్, నరేందర్, లక్ష్మణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -