Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారి మృతికి కారకులైన వారిని బహిరంగంగా ఉరితీయాలి

చిన్నారి మృతికి కారకులైన వారిని బహిరంగంగా ఉరితీయాలి

- Advertisement -

రాక్షస పాలనపై మండిపడ్డ యువత 
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
నవతెలంగాణ – దర్పల్లి 

నాగర్ కర్నూల్ జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం జాతరలో దేవుడి దర్శనానికి వెళ్లిన రజకుల కులానికి చెందిన కుటుంబాన్ని అగ్రకులాలకు చెందిన రెడ్డి వర్గం దాడి చేయడంతో రెండు నెల పాప తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మరణించింది. దాడిని నిరసిస్తూ చనిపోయిన పాపకు నివాళులు అర్పిస్తూ ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గాంధీ విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో నిరసన చేశారు. అనంతరం వి బాలయ్య, సంబెటి సుమన్ లోలం గంగారెడ్డి మాట్లాడుతూ..అడుగడుగునా చిన్నా చితక తేడా లేకుండా బడుగు బలహీనవర్గాల మా ఆడబిడ్డలు  మాన, ప్రాణాలను రాబందుల చేతుల్లో  కోల్పోతూ పుడమి తల్లికి ఆహుతి అవుతున్నారని అన్నారు.

గల్లీలలో మొదలైన ఈ నిరసన సెగ ఢిల్లీ వరకు వినిపించాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల జోలికొస్తే అగ్రకులాలకు వెన్నులో వణుకు పుట్టేలా తెగించి ముందుకు కదలాలని అన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనలు మాకెందుకు అనడం మానేసి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడి నుండే ప్రశ్నించడం మొదలుపెట్టాలని అన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యక దేశంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ధర్మాన్ని రక్షించాల్సిన వారే హిందూ దేవాలయాలను వ్యాపార సముదాయాలుగా మారుస్తూ దేవుని దర్శనాన్ని ప్రత్యేక కోణాలుగా విభజిస్తూ కులాల్లో మనుషులలో వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయని అన్నారు. ఇదే కోణంలో జరిగిన మానవీయ ఘటననే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేవుని దర్శనం చేస్తున్న టైంలో వంద రూపాయలు టికెట్ తీసుకొని దేవున్ని దర్శనం చేసుకోవాలని  రెడ్డి వర్గానికి చెందిన వారు హుకుం జారి చేశారు. మేం రజకులం గుడికి సున్నము,  కలరు  వేసాము గుడి శుభ్రంగా కడిగాము కాబట్టి మేం టికెట్ తీసుకోము అని రజకులు చెప్పడంతో అతన్ని అతని కుటుంబాన్ని కొబ్బరికాయల రూమ్ లోకి తీసుకెళ్లి నాలుగు గంటలసేపు విపరీతంగా కొట్టారు.

బండ బూతులు తిడుతూ ఒంటిపైన ఉన్న బట్టల్ని చించివేశారు. కనీసం స్త్రీలు అని చూడకుండా ఇంకిత జ్ఞానం లేకుండా రాక్షసుల లాగా వ్యవహరించారు. వారి వెంట ఉన్న  రెండు నెలల  కూతుర్ని కాలితో తన్నడంతో పాప స్పృహ తప్పి కోమల్లోకి వెళ్ళింది. 100 నెంబర్ ఫోన్ చేస్తే ఫోన్ చేసిన నాలుగు గంటల తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని ఆస్పత్రికి పాపను తరలించి వైద్యం చేపిస్తే రెండు రోజుల తర్వాత పాప కన్నుమూసింది. మా కుటుంబానికి అన్యాయం జరిగింది మాపై దాడి చేశారు. మా పాప చనిపోయింది అని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అక్కడి పోలీసులు స్పందించకుండా దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా కాలయాపన చేశారు.

అగ్రకులాల వారు వెనుకబడిన తరగతుల రజకుల కుటుంబం పై దాడికి దిగడం అంటే రెడ్డి ల పరిపాలన కొనసాగుతుంది. అని అహంకార ధోరణితో దాడికి పాల్పడ్డారు. ఆనాడు భూస్వాములు గ్రామంలో ఏ విధంగా దాడులు చేశారు. ఈ రోజున కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సపోర్ట్ చూసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలపై రాష్ట్రంలో ఏదో ఒకచోట నిత్యం దాడులు జరుగుతున్నాయి. దాడికి పాల్పడిన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరుల్ని 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ చేసి వారిని బహిరంగంగా ఉరితీయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెలిమెల నవీన్, నారాయణ, వడ్ల మురళి, రజక కులస్తులు మహిపాల్ రావుట్ల ప్రశాంత్, హాన్నాజిపేట్ రాజేందర్, గాయకుడు ధర్పల్లి సాయికుమార్, రవీందర్ గౌడ  మైపాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -