నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పిప్రీ ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి సంతోష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కూరపాటి అరుణ జ్యోతి అన్నారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని, నేడు ప్రభుత్వ హాస్టల్లో సరియైన సౌకర్యాలు ఉండడం లేదని, భోజనం సైతం సక్రమంగా పెట్టకుండా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో ఇటువంటి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నావని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ మహిళ సభ్యురాలు పాల్గొన్నారు.
విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES