Sunday, September 14, 2025
E-PAPER
Homeసినిమాఆ హక్కులు మావే..

ఆ హక్కులు మావే..

- Advertisement -

‘అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ బయోపిక్‌, టైటిల్‌ హక్కులు మాకే సొంతం’ అని వీఎన్‌ఆర్‌ ఫిలింస్‌ స్పష్టం చేసింది. ‘అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్‌ టైటిల్‌తో వీఎన్‌ఆర్‌ ఫిలింస్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.బి. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చర్త రాజుబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఎలాంటి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ లేకుండా ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్‌తో ఉషారాణి మూవీస్‌ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మాతగా, రవి నారాయణ్‌ దర్శకుడిగా రూపొందిస్తున్నారు. ఈ విషయంపై వీఎన్‌ఆర్‌ ఫిలింస్‌ స్పందిస్తూ,’అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ బయోపిక్‌ టైటిల్‌ను మేం ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించాం. అయితే ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్‌తో ఉషారాణి మూవీస్‌ సినిమా రూపొందిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు రవి నారాయణ్‌ మమ్మల్ని గతేడాది టైటిల్‌ ఇవ్వమని అడిగారు. మేము సినిమా చేస్తున్నాం కాబట్టి టైటిల్‌ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాం. అయినా కూడా మా అనుమతి లేకుండానే సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. మాకు చెందిన టైటిల్‌తో ఎవరు సినిమా రూపొందించినా చట్టపరంగా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. ఉషారాణి మూవీస్‌ పై చట్టపరమైన చర్యలను తీసుకుంటాం’ అని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -