సీఎం రేవంత్‌రెడ్డికి పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్ అర్హత కావాలని ఆదేశించిందనీ, సర్వీసులో ఉన్న వారికి మినహాయింపునివ్వాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు. రేవంత్‌రెడ్డి స్పందిస్తూ టెట్ నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో ఉన్న ఉత్తర్వులను కొనసాగిస్తూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ కమిటీ చైర్మెన్ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలి
- Advertisement -
- Advertisement -