- Advertisement -
ఏటీపీ ర్యాంకింగ్స్ విడుదల
లండన్ : వింబుల్డన్ చాంపియన్ జానిక్ సినర్ (ఇటలీ), రన్నరప్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నారు. 23 ఏండ్ల సినర్ 1990 తర్వాత 12000 పాయింట్లు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. జానిక్ సినర్ (12030), కార్లోస్ అల్కరాస్ (8600), అలెగ్జాండర్ జ్వెరెవ్ (6310), టేలర్ ఫ్రిట్జ్ (5035), జాక్ డ్రేపర్ (4650) టాప్-5లో కొనసాగుతున్నారు. నొవాక్ జకోవిచ్ (4130) ఆరో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి సుమిత్ నాగల్ తొమ్మిది స్థానాలు మెరుగై 287వ ర్యాంక్‌లో నిలిచాడు.
- Advertisement -