పంచాయతీ కార్యదర్శులతో ఎంపిడిఓ సమీక్ష సమావేశం.!
నవతెలంగాణ – మల్హర్ రావు: ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ యువవికాసం తదితర పథకాలపై మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన వారిని గుర్తించాలని పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ సిబ్బందికి ఎంపిడిఓ నల్లగొండ శ్రీనివాస్ సూచించారు. శనివారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఎంపిడిఓ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎంపిడిఓ శ్యాంసుందర్ పదవి విరమణ పొందారు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఎంపిడిఓ పలిమేల మండలం నుంచి బదిలీపై వచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మహేందర్, ఎపిఓ హరీష్, పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులైన వారిని గుర్తించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES