Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

- Advertisement -

ఎంఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఇంజం వెంకటస్వామి
నవతెలంగాణ – కాటారం 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన కల్వల బాలాజీ (ఎస్సీ మాదిగ)పై జరిగిన దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఇంజం వెంకటస్వామి డిమాండ్ చేశారు. భూమి ఆక్రమణ ఉద్దేశంతో మంతెన సమ్మయ్య, రాజయ్య, బాపు సహా పలువురు అర్ధరాత్రి బాధితుడి ఇంటిపై దాడి చేసి, కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారని ఆయన తెలిపారు. 2024 ఏప్రిల్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కాటారం డిఎస్పీని కలిసి నిందితులను వెంటనే రిమాండ్‌కు పంపించాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -