నవతెలంగాణ- అమరావతి: పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదిక 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని జనసేనాని అన్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో జనసేన పార్టీ నివాళుల కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని అన్నారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని తెలిపారు. ఉగ్రఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ గుర్తుచేశారు.
అలా మాట్లాడేవారు పాకిస్థాన్ కు వెళ్లిపోండి: డిప్యూటీ సీఎం పవన్
- Advertisement -
RELATED ARTICLES