Tuesday, September 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ముగ్గురు పిల్లలుంటే అనర్హులే

ముగ్గురు పిల్లలుంటే అనర్హులే

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే అభ్యర్థన గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీంతో ముగ్గురు పిల్లలున్న వారు ఎన్నికల్లో పోటీచేసే వీలు లేదన్నది స్పష్టమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో ముగ్గురు పిల్లలున్నవారు పోటీచేయడానికి వీలులేదనే నిబంధనను తీసుకొచ్చింది. దీంతో మూడు దశాబ్దాలుగా ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి దూరంగా ఉండాల్సి వస్తున్నది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తేసింది. ముగ్గురు పిల్లలున్నవారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలోనూ అదే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆశావాహులు ఆశించారు. ఈ విషయం మంత్రి సీతక్క కూడా హామీనిచ్చారు. కానీ, ముగ్గురు పిల్లలున్నవారు పోటీచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఎక్కడా పొందుపర్చలేదు. దీంతో ఈసారి వారికి నిరాశే ఎదురైనట్టు అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -