నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన తోటకూర శ్రీ వంశీ కృష్ణ, హారిక కుమారుడు తోటకూర ఉమేష్ ప్రతిష్టాత్మక సౌత్ జోన్ ఇంటర్-స్టేట్ అండర్-14 బాలుర క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఇది అతని యువ క్రికెట్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రతిభావంతుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్, ఉమేష్ తన స్థిరమైన ప్రదర్శనలు, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.
బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోటకూర వెంకటేశ్వరరావు మనవడు ఉమేష్. ఉమేష్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని విజ్ఞాన్ జ్యోతి స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు.అక్కడ పాఠశాల యాజమాన్యం, కోచ్‌లు క్రీడలతో విద్యతోపాటు క్రీడలను సమతుల్యం చేయడానికి ఉమేష్ ని క్రీడారంగంలో బాగా ప్రోత్సహిస్తున్నారు.
ఉమేష్ ఎంపికపై గ్రామస్తులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ఉమేష్ పుట్టిన ఊరు ఆళ్లపాడుకు మరింత గుర్తింపు తీసుకురావాలని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమేష్ క్రికెట్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని, భారతదేశ క్రికెటర్ గా ఎదగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.



