- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో అంతుచిక్కని కారణంతో వేలాది కోళ్లు మృతి చెందాయనే సమాచారంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లను తీసుకురావొద్దని వ్యాపారులను ఆదేశించింది. సరిహద్దుల్లోని కోళ్ల ఫారాలపై నిఘా ఉంచాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించింది. చనిపోయిన కోళ్లను పూడ్చేయాలని తెలిపింది. అలాగే కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని ప్రజలకు సూచించింది.
- Advertisement -



