Saturday, May 10, 2025
Homeరాష్ట్రీయంశంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -

అధికారిక వెబ్‌సైట్‌కు ఈ మెయిల్‌
అధికారుల విస్తృత తనిఖీలు
నవతెలంగాణ-శంషాబాద్‌

గుర్తు తెలియని వ్యక్తి శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ శుక్రవారం పంపించారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అధికారిక వెబ్‌సైట్‌కు మెయిల్‌ వచ్చింది. పాకిస్థాన్‌తో భారత దేశానికి యుద్ధం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మెయిల్‌ రావడంతో ఆందోళన కలిగించింది. వెంటనే అధికారులు అప్రమతమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టు ఔట్‌ పోస్ట్‌ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్ఞాత వ్యక్తి నుంచి ఎయిర్‌పోర్టు అధికారిక వెబ్‌సైట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ‘ఏ క్షణమైన బాంబుతో ఎయిర్‌పోర్టును పేల్చివేస్తామని హెచ్చరిక.. మీ ప్రభుత్వానికి చెప్పండి.. మేము విశ్వసనీయమైన స్లీపర్‌ సెల్స్‌’ అంటూ మెయిల్‌లో పేర్కొన్నాడు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు ఎయిర్‌పోర్టులో జాగిలాలు, బాంబు స్క్వాడ్‌, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఇతర భద్రత విభాగాలు అణువణువునా తనిఖీలు చేపట్టాయి. అనంతరం బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. బాంబు బెదిరింపుల విషయంలో ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. ఈమెయిల్‌ పంపిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -