నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్: జిల్లా పరిధిలో మహిళా విద్యార్థిని పై జరిగిన తీవ్రమైన స్టాకింగ్, బ్లాక్‌మెయిల్, క్రిమినల్ బెదిరింపు కేసులో ఇద్దరు నిందితులను ఏ1 షేక్ సల్మాన్, ఏ2 ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయడం జరిగిందని మావల సీఐ కర్ర స్వామి పేర్కొన్నారు. సీఐ వివరాల మేరకు ఈ ఘటన పట్ల బాధితురాలి నుండి అక్టోబర్ 23న మావల పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసునమోదు చేసి విచారణలో నిందితులు ఏ1, ఏ2 ఒకే బ్యాచ్‌లో చదివే వ్యక్తి ద్వారా పరిచయం చేసుకుని స్నేహం పేరుతో దగ్గరయ్యారు. గాంధీ పార్క్‌లో బర్త్‌డే పేరుతో బాధితురాలితో దగ్గరగా ఫోటోలు తీసుకున్నారు. బాధితురాలు సల్మాన్ ప్రేమ ప్రస్తావనను తిరస్కరించగానే ఆమెతో తీసుకున్న ఫోటోలను దుర్వినియోగం చేస్తానని చేయగా ఆమె స్నేహితురాలి అభ్యంతరకరమైన ఫోటోలు ఉన్నాయని కూడా అబద్ధంగా చెప్పాడు. ఫోన్ కాల్స్, మానసిక వేధింపులు కొనసాగించారు. అక్టోబర్ 20న టీచర్స్ కాలనీ, మావలలోని ఎం.ఎస్. బేకరీ వద్ద కలవాలని, లేకపోతే ఫోటోలను బహిరంగం చేస్తానని బెదిరించాడు.
స్నేహం పేరుతో మోసం
మావల పోలీస్ సిబ్బందితో కలిసి అక్టోబర్ 25న పొలిటెక్నిక్ కాలేజీ, బాలాజీనగర్ సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వివిధ మహిళలకు స్నేహం పేరుతో దగ్గరై ఫోటోలు తీసుకుని వాటిని బెదిరింపులకు, వేధింపులకు ఉపయోగించేవారని అంగీకరించారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం. ఫోన్లలో బాధితురాలి ఆరోపణలను బలపరిచే డిజిటల్ సాక్ష్యాలు లభ్యం.నిందితులను గౌరవనీయ స్పెషల్ జూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (పిసిఆర్) కోర్టుకు హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఇద్దరు నిందితుల చేత స్టాకింగ్, బ్లాక్‌మెయిల్ లేదా వేధింపులకు గురైన ఇతర మహిళలు, విద్యార్థులు వెంటనే మవాలా పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలి. బాధితుల వ్యక్తిగత గోప్యత పూర్తిగా రక్షించబడుతుంది. సమాజంలో ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల భద్రతకు మవాలా పోలీసులు కట్టుబడి ఉన్నారు. ఇలాంటి నేరాలలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ లో అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ తో బెదిరింపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



