నవతెలంగాణ – దుబ్బాక: ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు మూడున్నర దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒకే వేదికను పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం దుబ్బాక మున్సిపల్ పరిధి లచ్చపేట వార్డులోని జడ్పీహెచ్ఎస్ లో పదో తరగతి చదువుకున్న (1987- 88 బ్యాచ్) పూర్వ విద్యార్థులు.. అప్పటి గురువులు హెచ్ఎం నారాయణరెడ్డి, మ్యాథ్స్ టీచర్ మహిపాల్ రెడ్డి లను ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. పూర్వ విద్యార్థి గాజుల యాదగిరి ఇదే వార్డులోని ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఒక ఏడాది పాటు తాగునీటి సరఫరాకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ధాత్రిక వెంకటరమణ, జక్క సత్యనారాయణ, ఆస రవి వంగ యాదగిరి, తడక సుధాకర్, బాలచంద్రం, సుధీర్, అవధూత భాస్కర్, కొండ అశోక్, సుభద్ర, రమాదేవి, సునీత పలువురు పాల్గొన్నారు.
మూడున్నర దశాబ్దాల ఆత్మీయ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES