Sunday, October 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ముగ్గురు అరెస్ట్  

రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ముగ్గురు అరెస్ట్  

- Advertisement -


రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ముగ్గురిపై కేసు
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

మతద్వేషాలను రెచ్చగొట్టేలా పోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు పేర్కొన్నారు. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన లోనె సుమిత్, పజారె పవన్, కాంబ్లే ప్రషిత్‌లు బీమా కోరెగావ్‌ పాటపై కత్తులతో దాడిచేసే వీడియోను పోస్టు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా మతద్వేషాలను రెచ్చగొట్టే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మరణాయుధాలతో పోస్టు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేసిన వారిపై, అడ్మిన్ లపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -