3.050 కిలోల గంజాయిని, మూడు సెల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారినుండి 3.050 కిలోల గంజాయిని, మూడు సెల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్డీపీఎస్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సోమవారం రాత్రి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో వేల్పూర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న యాళ్ల రిశ్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 750 గ్రా.గంజాయిని, బైకు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో సోదాలు నిర్వహించి షేక్ సమీర్, షేక్ కలీం అనే వ్యక్తుల నుంచి 2.3 కిలోల గంజాయిని, రెండు బైకులు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మొత్తంగా 3.050 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ వెంకటేష్, ఎస్సై నరసింహ చారి, సిబ్బంది భూమన్న, గంగారం, విష్ణు, సాయి కుమార్ పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES