Tuesday, September 16, 2025
E-PAPER
Homeఖమ్మంలక్ష్మీ ప్రసన్న మృతి కేసులో ముగ్గురు అరెస్ట్

లక్ష్మీ ప్రసన్న మృతి కేసులో ముగ్గురు అరెస్ట్

- Advertisement -

– పరారీలో ఒకరు
నవతెలంగాణ – అశ్వారావుపేట

గత మూడు రోజుల క్రితం అనుమానాస్పద మృతి చెందిన పూల లక్ష్మీ ప్రసన్న  కేసు లో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసారు. ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ నాగరాజు రెడ్డి మంగళవారం తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేసిన ఎస్ఐ యయాతి రాజు నిందితులుగా తేలిన మృతురాలి భర్త నరేష్ బాబు,అతని సోదరి భూ లక్ష్మీ,తల్లి విజయ లక్ష్మి లను సీఐ నాగరాజు సమక్షంలో అరెస్ట్ చేసి హత్య కేసు లో వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.మరొక నిందితుడు శ్రీనివాసరావు పరారీ లో ఉన్నట్లు ప్రకటించారు.పరారీలో ఉన్న నిందితుని కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి   గాలిస్తున్నామని,అతన్ని త్వరలో అదుపులోనికి   తీసుకొని దర్యాప్తు వేగవంతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ వి.రామ్మూర్తి,శిక్షణా ఎస్ఐ అఖిల లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -