Tuesday, September 16, 2025
E-PAPER
Homeక్రైమ్అశ్వారావుపేట లక్ష్మీ ప్రసన్న మృతి కేసులో..ముగ్గురు అరెస్ట్‌, పరారీలో ఒకరు

అశ్వారావుపేట లక్ష్మీ ప్రసన్న మృతి కేసులో..ముగ్గురు అరెస్ట్‌, పరారీలో ఒకరు

- Advertisement -

నవతెలంగాణ-అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మూడు రోజుల కిందట అనుమానాస్పదంగా మృతిచెందిన పూల లక్ష్మీ ప్రసన్న కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్టు సీఐ నాగరాజు రెడ్డి మంగళవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్‌ఐ యయాతి రాజు నిందితులుగా తేలిన మృతురాలి భర్త నరేష్‌ బాబు, అతని సోదరి భూ లక్ష్మి, తల్లి విజయలక్ష్మిని సీఐ నాగరాజు సమక్షంలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరొక నిందితుడు శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం స్పెషల్‌ టీమ్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, అతన్ని త్వరలో అదుపులోకి తీసుకొని దర్యాప్తు వేగవంతం చేస్తామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌ఐ వి.రామ్మూర్తి, శిక్షణా ఎస్‌ఐ అఖిల ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -