Thursday, October 9, 2025
E-PAPER
Homeఖమ్మంమూడు రోజులు పామాయిల్ గెలల స్వీకరణకు సెలవులు

మూడు రోజులు పామాయిల్ గెలల స్వీకరణకు సెలవులు

- Advertisement -

– ప్రకటించిన ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టీ.సుధాకర్ రెడ్డి
– రైతులు సహకరించాలని మేనేజర్ లు కళ్యాణ్,నాగబాబు లు మనవి
నవతెలంగాణ – అశ్వారావుపేట

గత వారంలో  అధిక వర్షాల కారణంగా గెలలు త్వరితగతిన పక్వానికి రావడంతో రైతులు గెలలు సేకరణ ఉదృతం చేసారు. పరిశ్రమల గానుగ సామర్థ్యం మించి రెండు పరిశ్రమలకు నిరంతరాయంగా అధిక మొత్తం లో గెలలు  వస్తున్న తరుణంలో  ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు మూడురోజులు పాటు గెలలు స్వీకరణకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 19 వ తేదీ (శుక్రవారం),20 వ తేదీ  (శనివారం ),21 వ తేదీ  (ఆదివారం) మూడు రోజులు పాటు అప్పారావుపేట, అశ్వారావుపేట పరిశ్రమలకు  సెలవు ప్రకటించినట్లు జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి గురువారం ప్రకటించారు.

ప్రస్తుతం అప్పారావు పేట పరిశ్రమలో 3000 మెట్రిక్ టన్నుల గెలలు నిల్వ ఉన్నాయని,మరో  140 గెలలు వాహనాలు పరిశ్రమకు వచ్చి ఉన్నాయని మేనేజర్ కళ్యాణ్ గౌడ్,  అశ్వారావుపేట పరిశ్రమలో  1500 మెట్రిక్ టన్నుల గెలలు నిల్వ ఉన్నాయని,మరో  100 గెలలు వాహనాలు పరిశ్రమలోకి వచ్చి ఉన్నాయని ,మొత్తం 4500 మెట్రిక్ టన్నుల గెలలు ప్లాట్ ఫాం లు పై ఉండగా, 240 గెలలు వాహనాలు నిలిచి ఉన్నాయని తెలిపారు. కావున రైతు సోదరులు సహకరించి తిరిగి 22 వ తేదీ సోమవారం నాడు యధావిధిగా రెండు ఫ్యాక్టరీలు కు గెలలు సరఫరా చేయాలని అప్పారావు పేట,అశ్వారావుపేట మేనేజర్ లు కళ్యాణ్ గౌడ్,నాగబాబు లు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -