జెడ్పిటిసి రేసులో ఎవరి దారి వారిదే
బిసి మహిళలకు రిజర్వు చేయడంతో పరిశీలిస్తున్న అధిష్టానం
నవతెలంగాణ – పాలకుర్తి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి జడ్పిటిసి బీసీ మహిళలకు రిజర్వు చేయడంతో బిజెపిలో మూడు ముక్కలాట మొదలయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో బిజెపిలో జరుగుచున్న మూడుముక్కలాట పంచాయితీ అధిష్టానానికి చేరింది. పాలకుర్తి జడ్పిటిసి మహిళలకు కేటాయించడంతో బి ఫాం పొందేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్ సతీమణి దొంగరి అశ్విని గత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుతో వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. 20 సంవత్సరాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. శాతపురం గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు సతీమణి వేల్పుల లక్ష్మి శాతాపురం ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్ గా పని చేసిన అనుభవం ఉన్నది.
2024 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దేవరాజు బిజెపి పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి సైనిక వైద్యాధికారిగా పనిచేస్తూ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో స్వచ్ఛంద పదవీ విరమణ పొంది పాలకుర్తి నియోజకవర్గంలో, పాలకుర్తి మండలంలో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. బీసీ మహిళలకు పాలకుర్తి జడ్పిటిసి రిజర్వు చేయడంతో పాలకుర్తి జడ్పిటిసి గా పోటీ చేసేందుకు కల్నల్ బిక్షపతి సతీమణి మాచర్ల స్వరూపను తెరపైకి తీసుకు వస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. పాలకుర్తి ఎంపీపీ తో పాటు జడ్పీటీసీ బీసీ మహిళలకు కేటాయించడంతో బిజెపిలో మూడుముక్కలాట పంచాయితీ మొదలైంది. ముగ్గురు మధ్యలో ఉన్న వర్గ పోరు అధిష్టానానికి చేరిందనే గుసగుసలు ఉన్నాయి. మండలంలో బిజెపి బలం నామమాత్రంగా ఉన్నప్పటికీ జడ్పిటిసి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మూడుముక్కల పంచాయతీతో పోటీ చేస్తారా, సర్దుబాటులో వదులుకుంటారా వేచి చూడాల్సిందే.
బీజేపీలో మూడు ముక్కలాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES