Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగ్గురు అక్రమ ఇసుక నిందితుల అరెస్ట్.! 

ముగ్గురు అక్రమ ఇసుక నిందితుల అరెస్ట్.! 

- Advertisement -

పోలీసులపైనే దుండగులు దాడి చేసే యత్నం..
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని మల్లంపల్లి వాగు నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లతో రవాణ చేస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ తెలిపారు. పూర్తి కథనం ప్రకారం.. సోమవారం పెట్రోలింగ్ లో భాగంగా మల్లంపల్లి వెళ్తుండగా గ్రామ శివారు అటవీ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో ఇసుక దుండగులు పొలిసులపై దాడి చేసి అక్కడి నుండి పారిపోతుండగా వెంబడించగా మూడు ట్రాక్టర్లలో నిందితులు తప్పిచుకుని పారిపోగా, ఒక ట్రాక్టర్ అదుపు తప్పి అటవీ ప్రాంతంలో బోల్తా పడడంతో ట్రాక్టర్ ని విడిచి పెట్టి అక్కడినుండి నిందితులు పారిపోయారని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు. అక్రమ నేరాలకు పాల్పడుతూ, డ్యూటీ లో ఉన్న పోలిసులసై దాడులు చేస్తూ,విధులకు ఆటంకం కలిగించిన నిందితులకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -