- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలకల కిందపడి నలిగిపోయి ముగ్గురు మృతి చెందారు. మార్టూరు నుంచి చిలకలూరిపేట, పర్చూరు మీదుగా గుంటూరు వెళ్తుండగా తిమ్మరాజుపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో పలకలను తొలగించారు. మృతులను మార్టూరుకు చెందిన పాలపర్తి శ్రీను (25), తాళ్లూరి ప్రభుదాస్ (37), నూతలపాడుకు చెందిన తమ్ములూరి సురేంద్ర (26)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -