నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
నూతన సంవత్సరం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3 నుండి ప్రతి గ్రామంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తుందని ఎంపీడీవో రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలను గ్రామ సమాఖ్య ల వారిగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. వివో ఏలు , వివో ఓ బి లు తమ గ్రామంలో కమిటీగా ఏర్పడలన్నారు. కనీసం వంద మంది ముగ్గుల పోటీలో పాల్గొనేలా చూడాలన్నారు. న్యాయ నిర్ణేతలు గ్రామ సర్పంచి, మహిళ అధికారి, స్కూల్ హెడ్ మాస్టర్, పంచాయతీ కార్యదర్శి ఉంటారన్నారు. గ్రామస్థాయిలో ముగ్గుల పోటీలో రాణించిన వారికి ఈ నెల 6న మండల స్థాయిలో జరిగే ముగ్గుల పోటీలో పాల్గొంటారని అన్నారు. ప్రతి గ్రామంలో ముగ్గుల పోటీలలో విజయవంతం చేయాలని కోరారు.
3న గ్రామాలలో ముగ్గుల పోటీలు: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



