నవతెలంగాణ – కంఠేశ్వర్
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని శివాజీ నగర్ లో దాసరి కిషన్, నాగమణి దంపతులు, వీరి కుమారుడు వంశి కర్రీ పాయింట్ వ్యాపారం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరు ముగ్గురు పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కాలనీ వాసులు వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే దాసరి కిషన్ మృతి చెందాడు. దాసరి నాగమణి, వంశిల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు నగర సీఐ శ్రీనివాస రాజు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యయత్నం
- Advertisement -
- Advertisement -



