Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు కట్టంగూర్ కు ముగ్గురు మంత్రుల రాక 

రేపు కట్టంగూర్ కు ముగ్గురు మంత్రుల రాక 

- Advertisement -


నవతెలంగాణ – కట్టంగూర్: రేపు మండల కేంద్రంలో నిర్వహించే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముగ్గురు మంత్రులు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది చుక్కయ్య తెలిపారు. సోమవారం కట్టంగూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ జెడ్పిటిసిలు సుంకర బోయిన నర్సింహ్మ, మాద యాదగిరి, నాయకులు రెడ్డిపల్లి సాగర్, మిట్టపల్లి శివ,అయితగోని నారాయణ, రెడ్డిపల్లి వీరస్వామి, ముక్కామల శేఖర్, గద్దపాటి దానయ్య, అయితగోని నర్సింహ్మ,కంభం అనిల్ కుమార్ రెడ్డి, పోగుల చంద్రయ్య, కొంపెల్లి యాదయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -