ఖాట్మండు : నేపాల్ ప్రధాని సుశీలా కర్కి నేతృత్వంలోని తాత్కాలిక మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు మంత్రులను చేర్చుకున్నారు. అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడల్ సోమవారం వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఆర్థిక మంత్రిగా రమేషోర్ ఖానల్, ఇంధన శాఖ మంత్రిగా కుల్మాన్ ఘీజింగ్, హోం మంత్రిగా ఓం ప్రకాష్ ఆర్యల్‌లతో ఆదివారం సుశీలా కర్కి క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఖానల్ ఇప్పటివరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక సంస్కరణలపై గత ప్రభుత్వానికి ఆయన 400 పేజీలతో కొన్ని సిఫార్సులను కూడా అందచేశారు. ఒకప్పుడు నేపాల్‌లో విపరీతంగా వున్న విద్యుత్ కోతలకు అంతం పలికిన ఘనత కుల్మాన్ ఘీజింగ్‌దే. ప2016 వరకు నేపాల్ రోజుకు 18గంటల పాటు విద్యుత్ కోత ఎదుర్కొనేది. ఘీజింగ్ వచ్చిన తర్వాత మొదటిసారిగా 24గంటలు విద్యుత్ అందుబా టులోకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ఆర్యల్ అవినీతిపై పోరాడే యోధుడుగా అందరికీ చిరపరిచితుడు. ప్రధాని కర్కికి అత్యంత విశ్వసనీయుడైన ఆర్యల్ పార్లమెంట్ రద్దుపై నెలకొన్న ప్రతిష్టం భనను పరిష్కరించేందుకు జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు.
నేపాల్ క్యాబినెట్‌లోకి మరో ముగ్గురు మంత్రులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES