Friday, June 6, 2025
E-PAPER
Homeబీజినెస్7సీస్‌ నుంచి మూడు కొత్త గేమ్స్‌

7సీస్‌ నుంచి మూడు కొత్త గేమ్స్‌

- Advertisement -

క్రికెట్‌, గుర్రపు స్వారీ, కేక్‌ మ్యాచ్‌ల ఆవిష్కరణ
– ఆన్‌లైన్‌ రియల్‌గేమ్స్‌.కమ్‌ సైట్‌ పునరుద్ధరణ
నవ తెలంగాణ – హైదరాబాద్‌

ప్రముఖ లిస్టెడ్‌ గేమింగ్‌ కంపెనీ 7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ కొత్తగా మూడు గేమ్స్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇందు లో వరల్డ్‌ క్రికెట్‌ ఛాంపియన్స్‌ లీగ్‌, హార్స్‌ వరల్డ్‌ రైడ్‌, కేక్‌ మ్యాచ్‌, పజిల్‌ సార్ట్‌ గేమ్‌ అనే మూడు గేమ్‌లు ఉన్నాయని తెలిపింది. తన వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌రియల్‌గేమ్స్‌.కమ్‌లో వీటిని తిరిగి ప్రారంభించినట్లు ఆ సంస్థ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవి ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌, ఇండస్‌ యాప్‌స్టోర్‌లలో ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆవిష్కరణ, సృజనాత్మకతతో నిండిన భారతీయ గేమింగ్‌ ప్రపంచాన్ని ప్రదర్శించడం, పరికరాల్లో ఆటగాళ్లకు అధిక-నాణ్యత గేమింగ్‌ అనుభవాన్ని అందించడం దీని లక్ష్యమని వెల్లడించింది. గేమర్‌ల కోసం విస్తృత శ్రేణి గేమ్‌లతో స్నేహపూర్వక అనుభవాన్ని అందించడానికి ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రీ-టు-ప్లే క్యాజువల్‌ గేమింగ్‌ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌రియల్‌గేమ్స్‌.కమ్‌ను తిరిగి ప్రారంభించామని 7 సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎల్‌ఎం శంకర్‌ తెలిపారు. 150 పైగా వెబ్‌ ఆధారిత గేమ్‌ల సేకరణను అందిస్తుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి గేమ్‌ లైబ్రరీని రెట్టింపు చేయాలనే ప్రణాళికలతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమర్‌లకు మరింత గొప్ప అనుభవాన్ని అందించడానికి తమ వేదిక సిద్దంగా ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -