నవతెలంగాణ- హైదరాబాద్: కాల్పుల విరమణ అమల్లో వున్నా ఇజ్రాయిల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించినట్లు మీడియా వర్గాలు గురువారం తెలిపాయి. గాజా మరియు ఈజిప్ట్ మధ్య రఫా క్రాసింగ్‌ను ప్రజల రాకపోకల కోసం తెరవడం ఆలస్యమవుతుందని ఇజ్రాయిల్ ప్రభుత్వ సంస్థ తెలిపింది. గాజా కాల్పుల విరమణ విఫలమైతే హమాస్‌ను ఓడించేందుకు ‘సమగ్ర ప్రణాళిక’ను సిద్ధం చేయాలని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి సైన్యాన్ని ఆదేశించినట్లు మీడియా వెల్లడించింది. హమాస్ మరో ఇద్దరు ఇజ్రాయిల్ బందీల అవశేషాలను తిరిగి ఇచ్చిందని, అయితే శిథిలాల కింద ఇప్పటికీ పూడ్చని మృతదేహాలను గుర్తించడానికి ప్రత్యేక పరికరాలు మరియు సాయం అవసరమని ఇజ్రాయిల్ అంగీకరించినట్లు పేర్కొంది.
ఇజ్రాయిల్ దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES