నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి బుధవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. వీక్లీ మార్కెట్ లో పోలీసులు వాహనాల తనికి నిర్వహిస్తుండగా అటుగా ఇద్దరు వ్యక్తులు హెచ్ఎఫ్-డీలక్స్ టిఎస్ 16 ఈ వి 1553 నెంబర్ గల బండిని నడుపుతూ వస్తుండగా వారిని ఆపి, బైక్ యొక్క డాకుమెంట్స్ చూపించమనగా వారు డాకుమెంట్స్ చూపించకుండా పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకొని విచారించామన్నారు. విచారణలో హనుమాన్ నగర్ కు చెందిన గాజాబారే నగేష్ , నాల్కల్ రోడ్డుకు చెందిన హన్మంతే మోహన్ అని తెలిపారు.
వారు నడుపుతున్న బైక్ ను మహాలక్ష్మి హాస్పిటల్ నుండి దొంగాలించినట్టు ఒప్పుకొని, వారు చెడు అలవాట్లకు బానిసై వారి జల్సాలకు డబ్బులు లేక బైక్ల దొంగతనాలు చేసి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో వారి జల్సాలకు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దొంగతనాలు చేస్తున్నట్టు, అలాగే ఇదువరకే ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక బైక్ ను దొంగతనం చేసి దాన్ని వినాయక నగర్ కి చెందిన షేక్ గౌస్ అనే వ్యక్తి కి అమ్మగా, దొంగ బండి అని తెలిసి కూడా కొన్నాడు, ఇవే కాకా అర్యనగర్ లో ఒక టీవీఎస్ ఎక్సెల్ ను, వీక్లీ మార్కెట్ లో మరొక బైక్ ను దొంగిలించి వాటిని రైల్వే స్టేషన్ వద్ద గల చెట్ల పొదల్లో దాచినట్టు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి మూడు బైక్ లను స్వాదినపర్చుకున్నట్లు, వీరితో పాటు షేక్ గౌస్ ను కూడా పట్టుకొని అతని వద్ద నుండి కూడా బైక్ ను స్వాదినపర్చుకొని, ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిసియల్ రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.



