నవతెలంగాణ – ఆర్మూర్ : స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ లో దొరికిన 12మందిని కోర్టులో హాజరు పరచగా 9మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున 10000/-మొత్తం 90000/- రూపాయల జరిమానా, ముగ్గురు (3) మందికి ఒక్కొక్కరికి నాలుగు (4) రోజుల చొప్పున సాధారణ జైలు శిక్ష హానరబుల్ జె ఎఫ్ సి ఎం మేజిస్ట్రేట్ సరళ రాణి జరిమానా, జైలు శిక్ష విధించినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు మద్యం సేవించి వాహనాలు నడప రాదని, వాహనదారులకు మోటార్ వెహికల నూతన చట్ట ప్రకారం భారీగా జరిమాణాలు పెంచడంతోపాటు, జైలుశిక్షలు కూడా పెంచడం జరిగిందని తెలిపారు.. వాహనాల యొక్క ధ్రువపత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ముగ్గురికి నాలుగు రోజుల సాధరణ జైలు శిక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



